Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మెలిగిరి పేట చెరువులో చేప పిల్లలను వదిలిన సర్పంచ్ షాబుద్దీన్

మెలిగిరి పేట చెరువులో చేప పిల్లలను వదిలిన సర్పంచ్ షాబుద్దీన్

- Advertisement -

నవతెలంగాణ – సదాశివపేట 
సదాశివపేట మండల పరిధిలోని మెలిగిరిపేట గ్రామ సమీపంలోని చెరువులో ఆదివారం సర్పంచ్ షాబుద్దీన్ స్థానిక నాయకులతో కలిసి చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ షాబుద్దీన్ మాట్లాడుతూ.. చేప పిల్లల పెంపకం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఆరు లక్షల చేప పిల్లలను చెరువులో వదలడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మధుకర్ రెడ్డి, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు హనుమంతు, మల్లే శ్రీనివాసరెడ్డి, మన్నే లక్ష్మణ్, మన్నె వెంకటేశం, బోయిని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -