నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ సర్పంచ్ యెనుగందుల శైలేందర్ శుక్రవారం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మనల మోహన్ రెడ్డిని ఆయన స్వగృహంలో కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శైలేందర్ మాట్లాడుతూ తన సర్ప పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసి తనతో పాటు పాలకవర్గ సభ్యులను ఆశీర్వదించిన మోహన్ రెడ్డికి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా తన అన్నదండాలు ఉంటాయని హామీ ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తక్కురి రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి విజయ్ కుమార్, బద్దం తిరుపతిరెడ్డి, మారుపాక నరేష్, సాదుల్లా, తదితరులు పాల్గొన్నారు.
మానాల మోహన్ రెడ్డిని కలిసిన సర్పంచ్ శైలేందర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



