- Advertisement -
నవతెలంగాణ – గోవిందరావుపేట
ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం గెలిచిన వెంటనే వీధిలైట్లు వేస్తానని చెప్పిన నూతన సర్పంచి సీతారాం నాయక్ తన కార్యాచరణను ప్రారంభించారు. బుధవారం మండలంలోని లక్నవరం పంచాయతీ బొల్లేపల్లి గ్రామంలో నూతన సర్పంచ్ బుక్య సీతారాం నాయక్ ఆధ్వర్యంలో వీధిలైట్లను స్వయంగా నిర్మించి వెలిగించి గ్రామ ప్రజలకు చూపించారు. తనను గెలిపించినందుకు పేరుపేరునా గ్రామ ప్రజలకు పదేపదే ధన్యవాదాలు తెలుపుతూ ఇచ్చిన హామీలను వరుస క్రమంలో అమలుపరుస్తానని ఎక్కడ వెనక్కి తగ్గేదే లేదని అన్నారు. తన చేతనైన మేరకు తక్కువ నిధులతో ఎక్కువ అభివృద్ధి సాగే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నానని గ్రామంలోని ప్రజలందరూ సహకరించాలని కోరారు.
- Advertisement -



