- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని లెంకలపల్లి గ్రామంలో ముత్యాలమ్మ గుడి నుండి పాక గూడెం వరకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైనటువంటి రూ.5 లక్షల వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్ల పనులకు బుధవారం గ్రామ సర్పంచ్ అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేతరి శంకర్, మాజీ ఉప సర్పంచ్ గుండెపూరి లక్ష్మయ్య, వార్డు నెంబర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ ఏర్పుల యాదయ్య, బుర్కల రామలింగం, కుంభం శ్రీను, తిప్పర్తి శ్రీరాములు, గంట దిలీప్, కారింగు నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



