- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ
మండల పరిధిలోని జలాల్ పూర్ గ్రామంలో సోమవారం సిసి రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి ప్రారంభించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాజ్యసభ ఎంపీ కే ఆర్ సురేష్ రెడ్డి సహకారంతో గ్రామంలోని రంగనాథ స్వామి ఆలయం వద్ద సిసి రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయని ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే, రాజ్యసభ ఎంపీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూగ బోజన్న, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిషన్ గౌడ్, వార్డు సభ్యులు, వీడీసీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



