Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించిన సర్పంచ్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని తడి ఇప్పర్గా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆ గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్న ముగ్గు పోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ ను మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని, ప్రతి లబ్ధిదారునికి రూ.5 లక్షలు అందిస్తుందన్నారు. ఇంటి నిర్మాణాలకై ప్రభుత్వ సహాయ సహకారాల ఉంటాయని, లబ్దిదారులందనూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారురాలు జయశ్రీ ఇంటికి ముగ్గుతో మారుకోటు వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి జ్యోతి, ఆ గ్రామ రేషన్ డీలర్ రామన్ రావు పాటిల్, వార్డు సభ్యులు రాజు, కర్జే విశ్వజిత్ రాజు మేస్త్రి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -