Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముగిసిన సర్పంచుల శిక్షణా తరగతులు

ముగిసిన సర్పంచుల శిక్షణా తరగతులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో తెలంగాణ ప్రభుత్వము పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహించిన శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. మూడవ విడతలో భాగంగాఈనెల 24 నుండి 28 వరకు జరిగిన ఈ శిక్షణ తరగతులకు మండలానికి చెందిన హాస కొత్తూర్ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, చౌట్ పల్లి సర్పంచ్ మహబూబ్, నాగపూర్ సర్పంచ్ కంపదండి అశోక్, కోన సముందర్ సర్పంచ్ బెజ్జారపు రాకేష్, కొత్తచెరువు తండా సర్పంచ్ లకావత్ సంతోష్, తదితరులు శిక్షణ తరగతులకు హాజరయ్యారు.

శిక్షణ ముగించుకున్న సర్పంచ్లకు అధికారులు శాలువాలతో సత్కరించి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. శిక్షణ తరగతుల్లో వివరించిన పలు అంశాల పట్ల సర్పంచులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ విధులు, బాధ్యతల గురించి తెలుసుకోవడంతోపాటు  పంచాయతీ నిధుల వినియోగం, ప్రజలకు అందించే సేవలపై అవగాహన కలిగినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -