నవతెలంగాణ – పెద్దవూర
మండల పరిధిలోని లింగంపల్లి గ్రామ సమీపంలో ఆదివారం వరద కాలువలు డిస్ట్రిబ్యూటరీ కాలువకు సిమెంట్ పని చేయిస్తున్న సందర్బంలో మిషన్ భగీరధ మెయిన్ పైపు లైన్ పగలి పోవడం తో మండలం లో రెండు రోజులుగా తాగునీటికి ఇబ్బంది ఏర్పడింది.దాంతో గ్రామ సర్పంచ్ నల్ల మెట్టి లక్షమమ్మ గ్రామ సమీపంలో సోమవారం పగిలిన పైప్ లైన్ కారణంగా నీరు వృథా పోతున్న విషయాన్ని తెలుసుకొని జేసీబీ సహాయంతో మరమ్మత్తు పనులను శరవేగంగా చేస్తున్నారు.
అదే విదంగా గ్రామం లో పలు వార్డుల్లో మిషన్ భగీ రధ వాటర్ పైపు లైన్ లీక్ కావడం తోలింగం పల్లి గ్రామం లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడ్డారు.వెంటనే గ్రామ సర్పంచ్ పనులు వేగవంతంగా మారామ్మత్తులు చేసి తాగునీటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు.దాంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వేపడుతున్న మరమ్మతు పనులను పకడ్బందీగా చేపట్టి భవిష్యత్లు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సూస్తామని సర్పంచ్ తెలిపారు.




