Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ ఉష-సంతోష్ మేస్త్రి, ఉపసర్పంచ్ రమేష్ కు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం

సర్పంచ్ ఉష-సంతోష్ మేస్త్రి, ఉపసర్పంచ్ రమేష్ కు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన ఉషా సంతోష్ మేస్త్రికి, అలాగే ఉప సర్పంచ్ గా ఎన్నికైన వట్నాల వార్ రమేష్ కు మద్నూర్ ప్రెస్ క్లబ్ పాలకవర్గం సభ్యులు ప్రమాణోత్సవ కార్యక్రమంలో వారికి శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సంధూర్ వార్ హనుమాన్లు, ఉపాధ్యక్షులు శివాజప్ప, ప్రధాన కార్యదర్శి కర్రే వార్ బాలు, జాయింట్ సెక్రెటరీ పండరి, కోశాధికారి నాగేష్ గౌడ్, సలహాదారులు నవనీత్ ,సుభాష్ ,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినందుకు నూతన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి ఉపసర్పంచ్ వట్నాల వార్ రమేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం తమ వంతు పత్రికల పరంగా సహకారాలు అందిస్తామని ప్రెస్ క్లబ్ నాయకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -