పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం
నవతెలంగాణ – మద్నూర్
జనం మెచ్చిన నేతగా మద్నూర్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన ఉషా సంతోష్ మేస్త్రి దంపతులకు సన్మాన కార్యక్రమాలు రోజు రోజుకు వెల్లువెత్తుతున్నాయి. మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ముదిరాజ్ కులానికి చెందిన ఉషా సంతోష్ మేస్త్రి ఎన్నికైన సందర్భంగా కులాల వారీగా ఆయన దంపతులను కలిసి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానాలు చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని పద్మశాలీలు సర్పంచ్ ఇంటికి వెళ్లి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంఘం సమస్యలు ఉంటే పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. గ్రామ అభివృద్ధికి ప్రజా సమస్యలకు మీ ద్వారా అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు కులస్తులు పాల్గొన్నారు.
సర్పంచ్ ఉషా-సంతోష్ మేస్త్రి దంపతులకు సన్మానాల వెల్లువ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



