- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన ఉషా సంతోష్ మేస్త్రికి సన్మానాలు రోజురోజుకు వెళ్ళు వెత్తుతున్నాయి. కులాలకు అతీతంగా అన్ని రంగాల వారు సర్పంచుకు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ అభివృద్ధికి ప్రజల కోరిక మేరకు అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని ఉషా సంతోష్ మేస్త్రి సన్మానాల వారికి హామీ ఇస్తున్నారు. సన్మానాలు చేసే వారికి ఉషా సంతోష్ మేస్త్రి దంపతులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు.
- Advertisement -



