Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన సర్పంచ్

అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు 
ప్రీ ప్రైమరీ విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీ రామగిరి గ్రామ సర్పంచ్ మాధురి ప్రశాంత్ అన్నాడు. మండలంలోని శ్రీరామగిరి గ్రామంలోని 1వ మరియు 3వ అంగన్వాడీ కేంద్రాలను ఐసిడిఎస్ సూపర్వైజర్ నీరజాతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాదరి ప్రశాంత్ మాట్లాడుతూ.. ప్రీ-ప్రైమరీ విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, అంగన్వాడీ కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఏకరూప దుస్తులను (యూనిఫాం) చిన్నారులకు అందజేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లోని రికార్డులను పరిశీలించి, కేంద్రాల నిర్వహణ తీరును తనిఖీ చేశారు. పిల్లలకు మెరుగైన సేవలు అందేలా అంగన్వాడీ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నీరజ, సెంటర్ టీచర్లు మద్దెల కనకతార తదితర అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -