- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీలో పలు డ్రైనేజీలో చెత్త, చెదారం పేరుకుపోయి మురికి కాల్వల్లో దుర్వాసన వేదజల్లుతొందని గ్రామస్తులు సర్పంచ్ కొండ రాజమ్మకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సర్పంచ్ శనివారం 2వ వార్డుతోపాటు పలు వార్డుల్లోని పారిశుద్ధ్య పనులను దగ్గరుండి చేయించారు. సర్పంచ్ పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



