నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కంఠాలి గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలకు గ్రామ సర్పంచ్ నాగనాథ్ ఆధ్వర్యంలో జిపి కార్యదర్శి భూమేశ్వర్ మార్కౌట్ చేసి ఇంటి నిర్మాణాలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాత్రే నాగనాథ్ జిపి కార్యదర్శి భూమేశ్వర్ మాట్లాడుతూ గ్రామంలో ఇందిరమ్మ పథకంలో గృహ నిర్మాణాలకు మంజూరైన లబ్ధిదారులందరూ త్వరితగతిన ఇంటి నిర్మాణాలను ప్రారంభించుకోవాలని సూచించారు. ఇంటి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా నేరుగా ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవాలని సూచించారు. లబ్ధిదారులు నిర్మాణం చేసుకుంటున్నా వారికి వారి ఖాతాలో మూడు విడతలుగా డబ్బులను అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామ కార్యదర్శి, ఇందిరమ్మ పతక గృహ నిర్మాణాల లబ్ధిదారులు , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్ చేసిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



