Thursday, January 1, 2026
E-PAPER
HomeNews11 ఓట్లతో గెలిచిన భూక్య నిర్మలాబాయి

11 ఓట్లతో గెలిచిన భూక్య నిర్మలాబాయి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
మండలంలోని బంగారుతండా గ్రామ పంచాయతీ నుంచి 11 ఓట్ల తేడా తోనే సర్పంచ్ అభ్యర్థి బుక్య నిర్మలబాయి గెలుపొందారు. బుక్య నిర్మలాబాయి గ్రామ పంచాయతీలో మొత్తం 390 ఓట్లు ఉండగా 206 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి సాయికుమార్పై 11 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

15 ఓట్ల మెజారిటీ మరొక సర్పంచ్ అభ్యర్థి గెలుపు.
మండలంలోని కలమడుగు గ్రామంలో హోరాహోరీ సాగిన పోరులో 15 ఓట్లతో చివరికి బొంతల నాగమణి గెలుపొందారు. బొంతల నాగమణి  గ్రామంలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగగా.. మండలంలో ఆసక్తికరంగా మారిం ది. ఒకటి, ఐదు ఓట్ల తేడాతోనే అధిక్యత కన బరుస్తూ ఉన్న నాగమణి ప్రత్యర్థి అభ్యర్థి స్వరూపరాణిపై చివరికి 15 ఓట్లు మెజారిటీ తో గెలుపొందడం గమనార్హం. నాగమణి భర్త మంతల మల్లేష్ ఇటీవేలే బిజెపి నుంచి కాంగ్రెస్లో చేరడం, అధికార పార్టీ కావడంతో గెలుపుకు తోడైందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -