- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పొట్టిచేలిమ కృష్ణా నది తీరం లో చిన మేడారం గా పేరుపొందిన సమ్మక్క,సారక్క జాతరలో జాతర పరిధిలో వున్న కుంకుడుచెట్టు తండా,పొట్టేవాణితండా,నీమానాయక్ తండా పుల్యా తండా గ్రామాల సర్పంచులు రమావత్ హేమ్లానాయక్,రమావత్ బాబునాయక్,రమావత్ బాసునాయక్,రమావత్ లక్ష్మణ్ నాయక్ లు శనివారం సమ్మక్క,సారక్క ఆలయం లో పూజలు నిర్వహించి నిలువెత్తు బంగారం సమర్పించారు. ఈ సందర్బంగా ఆలయ గుంజా అంజమ్మ,కార్యదర్శి నాగపురి లక్ష్మి, ఆర్గనైజర్ కృష్ణంరాజు, జాతర ముఖ్య నిర్వహకులు నాగపురి వెంకట పతిరాజు, సాంభశివ, ప్రియదర్శినిలు సర్పంచులకు శాలువా కప్పి ఘన సన్మానం చేశారు.
- Advertisement -



