Wednesday, January 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఒకరినొకరు సన్మానించుకున్న ఇరు గ్రామాల సర్పంచ్ లు

ఒకరినొకరు సన్మానించుకున్న ఇరు గ్రామాల సర్పంచ్ లు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని రెండు గ్రామాల సర్పంచ్ లు ఒకరిని మరొకరు సన్మానించుకున్నారు. జుక్కల్ మండల కేంద్రంలో మాదాపూర్ సర్పంచ్ ఆశ చందర్ పటేల్ ను నాగల్ గావ్ గ్రామ సర్పంచ్ జాదవ్ సునంద బాబు పటేల్ శాలువాతో సన్మానించారు. అనంతరం జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ.. జుక్కల్ మండలంలో మహిళలు అత్యధికంగా సర్పంచులుగా గెలుపొందడం శుభసూచకమని అన్నారు.

అందులో విద్యావంతులు తక్కువగా ఉన్నారు. నిరక్షరాస్యులు, పేద మహిళలు ఎక్కువ కావడంతో గ్రామ సర్పంచుల పాత్ర గ్రామాభివృద్ధిలో ఎంతో కీలకమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్పంచుల శిక్షణ శిబిరంలో మండలం నుండి జిల్లా కేంద్రానికి శిక్షణ తరగతులకు తప్పక హాజరు అవుతామని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తమకు తెలియని విషయాలు తెలుసుకుంటామని అన్నారు. గ్రామపంచాయతీ చట్టాలను తెలుసుకోవడం చాలా ఉపయోగకరమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ సర్పంచ్, నాగర్ గావ్ సర్పంచ్ సునంద గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -