నవతెలంగాణ-కమ్మర్ పల్లి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో తెలంగాణ ప్రభుత్వము పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈనెల 19 నుండి 28 వరకు జరగనున్న ఈ శిక్షణ తరగతుల్లో బుధవారం మండలానికి చెందిన పలు గ్రామాలకు చెందిన సర్పంచులు శిక్షణ తరగతులకు హాజరయ్యారు.
హాస కొత్తూర్ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, చౌట్ పల్లి సర్పంచ్ మహబూబ్, నాగపూర్ సర్పంచ్ కంపదండి అశోక్, కోన సముందర్ సర్పంచ్ బెజ్జారపు రాకేష్, కొత్తచెరువు తండా సర్పంచ్ లకావత్ సంతోష్, తదితరులు శిక్షణ తరగతులకు హాజరయ్యారు. శిక్షణ సందర్భంగా సర్పంచ్ ల తమ విధులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించినట్లు సర్పంచ్లు పేర్కొన్నారు. పంచాయతీ నిధుల వినియోగం, ప్రజలకు అందించే సౌకర్యాలపై వివరంగా శిక్షణ ఇచ్చినట్లు ఈ సందర్భంగా పలువురు సర్పంచులు తెలిపారు.


