నవతెలంగాణ – మద్నూర్
ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆయాంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు కృషి ఫలితంగా మద్నూర్ మండలంలోని చిన్నతడుగూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణంలో ఆ గ్రామ సర్పంచ్ సూర్య వంశి ప్రకాష్ కృషి అభినందనీయమని ఈ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చురుగ్గా సాగుతున్నాయని హౌసింగ్ ఏఈ హనుమంత్ తన పరిశీలనలో పేర్కొన్నారు. హౌసింగ్ ఏఈ ఆ గ్రామాన్ని సందర్శించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులకు అన్ని రకాలుగా ఇండ్ల నిర్మాణం పనుల్లో సర్పంచు కావలసిన సహాయ సహకారాలు అందించడం పనులు వేగంగా జరుగుతున్నట్లు ఏఈ తెలిపారు. ఇండ్ల నిర్మాణాల పరిశీలనలో సర్పంచ్ సూర్య వంశి గ్రామ కార్యదర్శి మాధవరావు హౌసింగ్ ఏఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సర్పంచ్ కృషి అభినందనీయం: హౌసింగ్ ఏఈ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



