Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ వినూత్న ఆలోచన.!

సర్పంచ్ వినూత్న ఆలోచన.!

- Advertisement -

• ప్రజల సమస్యలపై ఇంటింటా సర్వే 
• సమస్యల పరిష్కారానికి అడుగులు 
• సర్పంచ్ నిర్ణయంపై హర్షాతిరేకాలు 
నవతెలంగాణ -పెద్దవంగర
ఆయన ఓ యువ సర్పంచ్, ప్రజలకు ఏదైనా చేయలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. సర్పంచ్ గా గెలవగానే ఆయనకు ఓ వినూత్న ఆలోచన తట్టింది. ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి ఇంటింటా సర్వే కు శ్రీకారం చుట్టారు మండలంలోని వడ్డెకొత్తపల్లి సర్పంచ్ దంతాలపల్లి పరశురాములు. అందులో భాగంగా సోమవారం ఆయన గ్రామ పంచాయతీ కార్యదర్శి పరమేశ్వర్ తో కలిసి నేరుగా ఇంటింటికి వెళ్లారు. ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు.‌

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ‘గ్రామ సమస్యల సర్వే’ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా తామంతా ప్రజల వద్దకు నేరుగా ఇంటికి వెళ్లి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటామని పేర్కొన్నారు. ఇది నిరంతర కార్యక్రమమని, ప్రాధాన్యత ఆధారంగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతామని వెల్లడించారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవాలని, గ్రామ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. కాగా సర్పంచ్ నిర్ణయంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్రగొల్ల రమేష్, వార్డ్ సభ్యులు దంతాలపల్లి లక్ష్మి, దండుగల సంధ్య శ్రీకాంత్, ఫీల్డ్ అసిస్టెంట్ హరీష్, కారోబార్ పరుశురాం, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -