Thursday, March 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే నిధులు ఇవ్వడం లేదని  సర్పంచ్ ల  నిరసన…

ఎమ్మెల్యే నిధులు ఇవ్వడం లేదని  సర్పంచ్ ల  నిరసన…

- Advertisement -

– ప్రజాపాలనలో  ఎమ్మెల్యేను  నిలదీసిన సర్పంచ్ లు…
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్  : భువనగిరి లోని న్యూ వివేర కన్వెన్షన్ హాలులో  99రోజుల ప్రజా పాలన – ప్రగతి నివేదిక “లో భాగంగా జిల్లాలోని సర్పంచులందరికీ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని అడ్డుకొని  సర్పంచులు అడ్డుకొని నీరసన వ్యక్తం చేశారు  ఎమ్మెల్యే  సర్పంచులకు సమాధానం చెప్పలేక కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారని ఆరోపించారు.  ఈ సందర్బంగా బి  ఆర్ ఎస్  భువనగిరి సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు జక్క రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతు భువనగిరి ఎమ్మెల్యే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచిన గ్రామాలకు మాత్రమే విధులు కేటాయిస్తూ ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలిచిన గ్రామపంచాయతీలకు నిధులను కేటాయించకుండా  పూర్తి పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తూ రాజ్యాంగ బద్దంగా  మాకు రావలిసిన నిధులను అడ్డుకుంటూ మా గ్రామాల అభివృద్ధికి సహకరించడం లేదని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వలిగొండ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు పడమటి మమత, సర్పంచులు కాటిక జంగయ్య యాదవ్, శ్రీరామ్, శంకరయ్య, వెంకటేష్, నీలా శిరీష, నాగేల్లి గిరిజా, కేర్చిపల్లి గ్రామ సర్పంచ్ మద్దెల మంజుల, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -