- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండల పరిధిలోని గోకారం గ్రామంలో తెలంగాణ తొలి బహుజన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని గౌడ సంఘం నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. సర్వాయి పాపన్న అభినవ దళిత మరియు బహుజన ఉద్యమానికి నాయకుడుగా ఎదిగాడు. పాపన్న గొప్పతనం, పోరాటం అగ్రకుల ఆధిపత్యం, జమీందార్ల అరాచకపు పాలనకు వ్యతిరేకంగా తన సిద్ధాంతాలు, ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప యోధుడు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని పార్టీల నాయకులు, బహుజన నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
- Advertisement -