డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి కృష్ణయ్య..
నవతెలంగాణ – వనపర్తి
ఉపాధ్యాయ హోదా నుండి రాష్ట్రపతి స్థాయికి చేరిన సర్వేపల్లి రాధాకృష్ణన్ ను ఆదర్శంగా తీసుకోవాలి అని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి కృష్ణయ్య అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి వి రజని ఆదేశానుసారం గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రతిభ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఉచిత న్యాయ సలహాల కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు అని తెలియజేశారు. అదేవిధంగా మోటార్ వెహికల్ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు బాల బాలికలు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని తెలియజేశారు. ఈ చట్ట ప్రకారం ఎవరైనా వాహనాలు నడిపితే 25 వేల రూపాయల జరిమానా మూడు సంవత్సరాల జైలు శిక్ష తల్లిదండ్రులకు విధించబడుతుంది. అని తెలియజేశారు. అదేవిధంగా ఫోక్సో యాక్ట్ గురించి తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ ను ఆదర్శంగా తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES