నవతెలంగాణ – రెంజల్ : మండలంలోని సాటాపూర్ చౌరస్తా గుంతల మయంగా మారి నీరు నిండుకోవడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వేలాదిమంది ప్రజలు వివిధ వాహనాలపై వెళ్లడానికి ప్రధాన కూడలిగా ఉంది. ధర్మాబాద్, తాడు బిలోలి కి వెళ్లే బస్సులు సైతం ఈ చౌరస్తా గుండా వెళ్లాల్సి వస్తుంది. కందకుర్తి, పేపర్ మిల్, నీలా, బోర్గం, తాడు బిలోలి, గ్రామాల నుంచి అధిక సంఖ్యలో జనం ఇక్కడికి వస్తూ ఉంటారు. మహారాష్ట్ర వెళ్లాల్సిన వాహనాలు సైతం ఈ రోడ్డుపై నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. బోధన్ నుంచి వచ్చే వాహనాలకు చౌరస్తాలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులకు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించి చౌరస్తాలో ఉన్న గుంతలను పూర్తి ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ప్రమాదాలకు నిలయంగా సాటాపూర్ చౌరస్తా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES