- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు
అక్టోబర్ 30వ తేదీ నుండి జనగామలో శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు సౌత్ సెంట్రల్ రైల్వే హాల్టింగ్ అనుమతి ఇచ్చినట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం తెలిపారు. జనగామ జిల్లా కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రజల కోరిక మేరకు గత నెలలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాత్సవకు లిఖితపూర్వకంగా అభ్యర్థించినట్లు చెప్పారు. దానికి సనుకుల్లా స్పందించి జనగామలో స్టాప్ కు అనుమతించినట్లు చెప్పారు. తద్వారా విద్యార్థులు ఉద్యోగులకు వ్యాపారవేత్తలుకు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు సౌకర్యం మెరుగుపడిందన్నారు.రైల్వే అధికారులకు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



