పంటబీమా అమలు, పంటనష్ట అంచనాల్లో కీలకం
శాటిలైట్ మ్యాపింగ్‌పై వర్సిటీ, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశంలో మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పంటల సమగ్ర ప్రణాళికకు ఉపగ్రహ ఇమేజింగ్ దిక్సూచి కాబోతున్నదనీ, మార్కెటింగ్, డిమాండ్, ఉత్పత్తి, సరఫరా, గిడ్డంగి సదుపాయాలపై ఖచ్చిత నిర్ణయాలు తీసుకోవ డానికి దోహదపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. పంటబీమా అమలు, పంటనష్టాల అంచనాల నిర్ధారణలో శాటిలైట్ మ్యాపింగ్ కీలకం అవుతుందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో శాటిలైట్ మ్యాపింగ్‌పై వ్యవసాయ వర్సిటీ, ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ నీలిమ గతేడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన శాటిలైట్ డేటా ఆధారంగా సేకరించిన వివరాలను మంత్రికి వివరించారు. జిల్లావారీగా, మండలాలవారీగా, గ్రామాలవారీగా పంటల విస్తీర్ణం, వ్యవసాయశాఖ క్రాప్ బుకింగ్ డేటాలో ఉన్న స్వల్ప తేడాలను వివరించారు. ఈ డేటా కచ్చితత్వం కోసం ప్రస్తుత యాసంగి సీజన్‌లో కూడా పంటల సరళిని వ్యవసాయశాఖ క్రాప్ బుకింగ్ డేటాతో సరిపోల్చు తున్నట్టు తెలిపారు. ఈ యాసంగిలో వ్యవసాయ శాఖ వాలంటీర్ల ద్వారా డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహి స్తున్నందున, శాటిలైట్ డేటాకు గ్రౌండ్ ట్రూతింగ్ ద్వారా నిర్ధారణ చేసుకుని, వచ్చే సీజన్ నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో శాటిలైట్ మ్యాపింగ్ చేస్తున్నామని తెలిపారు. అది అందించే సమాచారం అధారంగా రాష్ట్రంలో పంటల ప్రణాళికను మరింత శాస్త్రీయంగా రూపొందించుకోవచ్చునన్నారు. ఉపగ్రహ మ్యాపింగ్ ద్వారా రైతులకు సమయానుకూల సూచనలు అందించడం, వ్యవసాయ శాఖ చర్యలను వేగవంతం చేయడం సులభమవు తుందని అన్నారు. ప్రకృతి విపత్తుల వల్ల పంటలకు కలిగే నష్టాలను త్వరితగతిన గుర్తించి ప్రభుత్వానికి చేరవేయడం ద్వారా సహాయక చర్యలను వేగంగా చేపట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. అధిక ఉత్పత్తి లేదా కొరత పరిస్థితులను ముందుగానే అంచనా వేసి సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించవచ్చునని వివరించారు. సర్వే నెంబర్ల వారిగా పంటల విస్తీర్ణం మదింపులో ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారం దిశగా కృషి చేయాలని వ్యవసాయ శాఖ కార్యదర్శికి సూచిం చారు. అటవీశాఖ భూముల్లో సాగులో ఉన్న యూక లిప్టస్, సుబాబులు విస్తీర్ణాలతో పాటు రైతులు సాగు చేస్తున్న ఇతర పంటల వివరాలు తెలిసేలా శాటిలైట్ డేటా విశ్లేషణ చేయాలన్నారు. ఉపగ్రహ డేటా ఆధారంగా భూసార స్థితి, నీటి లభ్యత, పంటల ఆరోగ్యం వంటి అంశాలను విశ్లేషించి రైతులకు సమగ్ర మార్గదర్శకాలు అందించవచ్చని వివరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మరియు వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు.
పంటల సమగ్ర ప్రణాళికకు ఉపగ్రహ ఇమేజింగ్ దిక్సూచి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



