క్వార్టర్స్‌లో ఓడిన సింధు
చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ
లీ-నింగ్(చైనా): చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్లోకి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జంట ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌లో పివి సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో సింధు 21-14, 21-13తో కొరియాకు చెందిన టాప్‌సీడ్ అన్-సే-యంగ్ చేతిలో వరుససెట్లలో ఓటమిపాలైంది. ఇక పురుషుల డబుల్స్‌లో 8వ ర్యాంకర్, భారత జంట చిరాగ్-సాత్విక్ 21-14, 21-14తో వరుససెట్లలో చైనా షట్లర్లను చిత్తుచేశారు. శనివారం జరిగే మహిళల సెమీస్‌లో టాప్‌సీడ్ అన్-సే-యంగ్ జపాన్‌కు చెందిన 4వ సీడ్ యమగుచి, 3వ సీడ్ హన్-యు(చైనా) అన్‌సీడెడ్ కొరియాకు చెందిన కిమ్‌తో రెండో సెమీస్‌లో తలపడనుంది.