స్విస్ ఓపెన్ సూపర్ 300
బసెల్ (స్విట్జర్లాండ్) : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి స్విస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి చేరుకుంది. బిడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో క్వార్టర్స్‌లో రాకెట్ పట్టకుండానే భారత స్టార్స్ ముందంజ వేశారు. శుక్రవారం క్వార్టర్‌ఫైనల్లో డెన్మార్క్ జోడీ క్రిస్టియన్, రాస్మస్‌లతో టాప్ సీడ్ సాత్విక్, చిరాగ్‌లు ఆడాల్సి ఉంది. కానీ మ్యాచ్‌కు ముందే డెన్మార్క్ షట్లర్లు వాకోవర్ ఇచ్చారు. దీంతో సాత్విక్, చిరాగ్‌లు నేరుగా సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. స్విస్ ఓపెన్‌లో ఇతర విభాగాల్లో భారత షట్లర్లు ఓటమిపాలవగా.. టైటిల్ వేటలో సాత్విక్, చిరాగ్ దూసుకెళ్తున్నారు.



