Friday, October 24, 2025
E-PAPER
Homeఖమ్మంసత్యం అకాల మృతి కుటుంబానికి తీరని లోటు 

సత్యం అకాల మృతి కుటుంబానికి తీరని లోటు 

- Advertisement -

– ప్రభుత్వం కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలి 
– సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 

ప్రమాదవశాత్తు ఎడ్లబండి ప్రమాదంలో అర్రెం సత్యం మృతి చెందడం ఆయన కుటుంబానికి తీరని లోటని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్ అన్నారు. ఈ మేరకు సత్యం మరణవార్త విని శుక్రవారం మండల పరిధిలోని మైలారం గ్రామంలో మృతుడి ఇంటికి ఆయన చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శోకార్తులైన కుటుంబ సభ్యులకు ఆయన మనోధైర్యమిచ్చారు.

ఈ సందర్భంగా ఏ.జె.రమేష్ మాట్లాడుతూ.. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న సత్యం అకాల మృతి బాధాకరమన్నారు. ప్రభుత్వం సత్యం కుటుంబాన్ని ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సత్యం మృతి పట్ల వివరాలు కుటుంబ సభ్యులను అడిగితెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబీ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ, జిల్లా కమిటీ సభ్యురాలు ఎస్.హెచ్.సుల్తానా, సీఐటీయూ ఇల్లందు, గుండాల మండలాల కన్వీనర్లు తాళ్లూరి కృష్ణ, వజ్జ సుశీల, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -