ఫిఫా అకాడమీ విద్యార్థులకు నాణ్యమైన విద్య
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులకు ప్రొఫెషనల్ క్రీడా శిక్షణతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని శాట్జ్ ఎండీ సోనీబాలాదేవి అన్నారు. రాష్ట్రంలో నాలుగు క్రీడా పాఠశాలలు, ఎనిమిది క్రీడా అకాడమీలు ఉండగా.. మరో ఆరు క్రీడాంశాల్లో అకాడమీలు త్వరలో ఆరంభం కానున్నాయి. ఫిఫా అకాడమీ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను బోధించేందుకు రయాన్ సంస్థతో శాట్జ్ ఎంఓయు కుదుర్చుకుంది. విద్యా బోధనకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్ర ప్రభుత్వం చూసుకోనుండగా.. విద్యా బోధన, వ్యక్తిత్వ వికాసం, స్టూడెంట్ కౌన్సెలింగ్, పరీక్షల సమన్వయం, క్రీడా పోటీల సమయంలో అకడమిక్ సపోర్ట్‌ను రయాన్ సంస్థ అందించనుంది. ఈ మేరకు ఎంఓయు ఒప్పంద పత్రాలను శాట్జ్, రయాన్‌లు పంచుకున్నాయి.
రయాన్ గ్రూప్‌తో శాట్జ్ ఒప్పందం
- Advertisement -
- Advertisement -



