శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాధురి ప్రశాంత్
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో సవార్ లచ్చమ్మ తల్లి వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ మాధరి ప్రశాంత్ తెలిపారు. ఆదివారం ఆ గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సవర్ లచ్చమ్మ తల్లి వేడుక సందర్భంగా గ్రామ ప్రజలు మొక్కిన మొక్కుల ను చెల్లించి నూతన కోరికలను కోరుకున్నట్లు తెలిపారు. ఆ తల్లి దీవెనలు ప్రజలపై ఎల్లవేళలా ఉండి పాడే పంటలు చల్లగా ఉండేటట్లు ఆశీర్వదించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామగిరి సుమన్, మాజీ వార్డు మెబార్స్, అరపెల్లి రాంచంద్రు, బందు రాములు, అరపెల్లి శ్రీనివాస్, మరియు కుల పెద్ద ఎడ్ల వెంకన్న, బిరెల్లి శివ, బందు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సవార్ లచ్చమ్మ వేడుక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



