Sunday, May 25, 2025
Homeమానవిపొదుపు చాలా ముఖ్యంప్రియమైన వేణు గీతికకు..

పొదుపు చాలా ముఖ్యంప్రియమైన వేణు గీతికకు..

- Advertisement -

ఎలా ఉన్నావు చిట్టి తల్లి? నీ రాక కోసం ఎదురు చూస్తూ రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. నాన్న ఈ రోజు నీకు డబ్బులు ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్తాను. చాలా మంది పిల్లలు ఉద్యోగస్తులు కాగానే ఆర్ధిక స్వేచ్ఛ వచ్చింది కదా అని, ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతుం టారు. భవిష్యత్తు గురించి ఆలోచన ఉండదు. అవసరం ఉన్న వాటికి ఖర్చు పెడితే పర్వాలేదు, కొందరు అవసరం లేకున్నా ఖర్చు పెడు తుంటారు. తర్వాత అప్పులు చేస్తుంటారు. సరైన ప్రణాళిక లేకపో వడం వల్ల వచ్చే ఇబ్బందులు ఇవి. అందుకే నీకు ఆర్ధిక ప్రణాళిక గురిం చి చెప్తాను. ఇది చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆర్ధిక నియంత్రణ చాలా చాలా అవసరం.
నీకు వచ్చే జీతంలో 25 శాతం ఎస్‌ఐపీ (సిస్టమటిక్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ప్లాన్‌)లలో ఇన్వెస్ట్‌ చేయి. 25 శాతం నీకోసం ఖర్చు పెట్టుకో. అంటే ఆహారం, బట్టలు.. మొదలైనవి. 25 శాతం రోజువారి అవసరాలు అంటే ఇంటి అద్దె, కరెంట్‌, గ్యాస్‌.. మొదలైనవి. 10 శాతం సామాజిక సేవ అంటే అవసరాల్లో ఉన్న వారి చదువులకు, మందులకు, నిత్యావసర సరుకులకు మొదలైన వాటి కోసం. 10 శాతం తల్లితండ్రుల ఆరోగ్యం కొరకు, 5 శాతం విహార యాత్రల కొరకు ప్రణాళిక చేసుకోవాలి.
ఒంటరిగా ఉన్నంత వరకు ఇలా చేస్తూ, పెండ్లి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి కనుక అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళిక చేసుకోవాలి. బ్యాంక్‌లో ఎప్పుడూ కొంత క్యాష్‌ ఉంచుకోవాలి. ఏనాడు ఎవరి దగ్గరా అప్పు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు. అవసరం అయితే కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి. కొంతమంది ‘మేడం మా బాబుకి బాగాలేదు డబ్బులు సర్దు బాటు చేస్తారా’ అని అడుగుతుంటారు. ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడం మన బాధ్యత. అందుకే పిల్లల కోసం నీ సంపాదన లోంచి కొంత దాచిపెట్టాలి. వేరేవాళ్ళు నీకు సాయం చేయాలనుకోవడం సరైన పద్ధతి కాదు. వచ్చే జీతం ఎంత ఉందో, అందులోంచి కొంత తప్పనిసరిగా భవిష్యత్తు లో వచ్చే సమస్యల కొరకు ఉంచుకోవాలి. ఏవైనా కార్యక్ర మాలు చేయాల్సిన సమ యంలో ఆర్ధిక ఇబ్బంది ఉంటే కుటుంబ సభ్యులతో నిర్వహించుకోవాలి. ఆర్భాటంగా చేయాల్సిన అవసరం లేదు.
ఇటువంటివి చాలా ఉంటా యి. కనుక నువ్వు పెట్టె ప్రతి పైసా దేనికి ఖర్చు చేస్తున్నావో రాసి పెట్టుకో, అనవసరపు ఖర్చు అయితే తగ్గించుకో. అంతే కాని ఎవరినీ అడగకు, అప్పులు చేయకు. నీ ఆర్ధిక ప్రణాళిక మీదనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది నాన్న. నాకు తోచింది చెప్పాను. పెండ్లి తర్వాత అయినా భార్య భర్తలు చర్చించుకుని, ఆలోచించి ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం నడవాలి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఎంత మందినో చూసాను డబ్బులు ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడం, ఇబ్బందులు ఎదురైనప్పుడు అప్పులు చేయడం. వచ్చే ఉత్తరంలో భవిష్యత్‌ గురించి పట్టించుకోకుండా ఉన్నది ఖర్చు పెట్టేస్తున్న వారి గురించి చెప్తాను. ఉంటాను నాన్న..
ప్రేమతో అమ్మ
– పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -