- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
భారతదేశ సామాజిక చరిత్రలో మహిళ విద్యకు పునాదివేసిన మహానియురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు శనివారం మండలంలోని రుద్రారం గ్రామ సర్పంచ్ చంద్రగిరి సంపత్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాబు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య,వార్డు సభ్యులు చంద్రగిరి అశోక్,జాడి రాజశేఖర్,భాష్క అశోక్,జాడి సమ్మయ్య పాల్గొన్నారు.
- Advertisement -



