– కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట
భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీకి అక్షరం అందని రోజుల్లోనే అవమానాలను భరిస్తూ, రాళ్ల దెబ్బలకు వెరవకుండా విద్యా విప్లవాన్ని ప్రారంభించిన ధీశాలి సావిత్రిబాయి ఫూలే అని కాంగ్రెస్ మండల అద్యక్షుడు తుమ్మ రాంబాబు అన్నారు. ఆమె జయంతి ని పురస్కరించుకుని శనివారం స్థానిక మూడు రోడ్ల ప్రధాన కూడలి లో గల ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రతి చదువుకున్న మహిళా ఆమెకు రుణపడి ఉండాలని, “విద్య లేకపోతే మనిషి పూరోగతే ప్రశ్నార్ధకం అని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు చిన్నంశెట్టి సత్యనారాయణ,ఫకీర్, శ్రీనాథ్,లింగిశెట్టి వెంకటేశ్వరరావు,కైలా శ్రీరాములు, రహిమత్, వేల్పుల సత్యనారాయణ, బూసి పాండురంగ,ఆలా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మహిళాభ్యున్నతి కోసం జీవితాన్నే అంకితం చేసిన సావిత్రిబాయి పూలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



