నవతెలంగాణ – మిర్యాలగూడ
భారతదేశ గొప్ప సంఘసంస్కర్త మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని సాకేత జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అండ్ చైర్మన్ నరేందర్ రెడ్డి హనుమంత రెడ్డి అన్నారు. శనివారం స్థానిక మిర్యాలగూడలోని సాకేత బాలికల జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య వక్త గా విచ్చేసిన ఉదయ మాట్లాడుతూ.. దాదాపు 200 సంవత్సరాల క్రితమే సావిత్రిబాయి పూలే సమాజంలో అసమానతలను రూపుమాపడానికి బాలిక విద్యకి కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్తని అన్నారు.
కార్యక్రమంలో మరో గ్రంథాలయ ఉద్యమ నేత కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ పూణేలో మొట్టమొదటిసారిగా బాలిక పాఠశాల స్థాపించి సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేశారని ఎన్నో అవమానాలను భరించి సావిత్రిబాయి పూలే సమాజంలో అసమానతల ను రూపుమాపడానికి కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో కేఎల్ఎన్ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి సుదర్శన్ కళాశాల అధ్యాపకు బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



