టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
సావిత్రిబాయి పూలే అంటే ఒక చరిత్ర అని పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం నిజామాబాద్ నగరంలోని హనుమాన్ జంక్షన్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ప్రభుత్వ అధినేతలు, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సమన్వయకర్తగా నరాల రత్నాకర్ వ్యవహరించి సభను నిర్వహించారు.
సావిత్రిబాయి పూలే చరిత్రను ప్రతి ఒక్క బీసీ బిడ్డ చదవాలని 200 ఏళ్ల కిందటే చదువు యొక్క ప్రాముఖ్యతను గుర్తించి బడుగు బలహీన వర్గాలకు వితంతువులకు నిరుపేదలకు నిరాశ్రయులకు చదువు నేర్పించినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి చరిత్ర ప్రతి ఒక్క విద్యార్థితో పాటు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మరియు వారి అడుగుజాడల్లో నడవాలని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అదేవిధంగా నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు.నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సమన్వయకర్తగా నరాల రత్నాకర్ ఉండి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు నరాల సుధాకర్ ఆకుల ప్రసాద్ దర్శనం దేవేందర్ కరిపె రవీందర్, మాడవేడి వినోద్ కుమార్, శ్రీలత, బగ్గలి అజయ్, కోడూరు స్వామి, పొదిలి శోభ, సాయి బసవ, గోపాలకృష్ణ, రమణ స్వామి, దాదాపు 30 బీసీ కుల సంఘాల నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరైనారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్సి ఆకుల లలిత, నుడా చైర్మన్ కేశవ వేణు, డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, వ్యవసాయ కమిషన్ మెంబర్, గడుగు గంగాధర్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



