– ప్రభుత్వం ఆమె జయంతి ని టీచర్స్ డేగా నిర్ణయించడం హర్షణీయం
– సీపీఐ(ఎం) నేత కొక్కెరపాటి పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
భారతదేశ తొలి మహిళా ఉపాద్యాయురాలు, చదువులమ్మ సావిత్రిబాయి ఫూలే మహిళా సాధికారతకు నిలువుటద్దం అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. ఆమె జయంతి సందర్భంగా శనివారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మూడు రోడ్ల ప్రధాన కూడలి లోని ఆమె విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు.
భారత దేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు “సావిత్రి భాయి పూలే” జయంతి ని “మహిళా టీచర్స్ డే” గా జరపాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించడం, రాష్ట్రంలోని సంబంధిత అధికారులకు విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్ ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం మని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి,మండల కార్యదర్శి సోడెం ప్రసాద్,కార్యదర్శి వర్గ సభ్యులు ముల్లగిరి గంగరాజు, మడిపల్లి వెంకటేశ్వరరావు,తగరం నిర్మల,నందిపాడు ఉపసర్పంచ్ తుట్టి వీరభద్రం,6 వ వార్డు సభ్యురాలు మడకం మంగమ్మ,కోయ రంగా పురం 5,7 వార్డు సభ్యులు చిచ్చోడి ముత్తమ్మ,వర్షా ముత్తమ్మ లు పాల్గొన్నారు.



