Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ కే అశోక్ తెలిపారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. మహిళా విద్య అభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అనన్యసామాన్యమని అన్నారు. ఆమె భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సమాజంలో విద్యా వెలుగులు నింపారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -