Monday, January 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలల్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు 

పాఠశాలల్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్   
సమాజంలో మహిళ విద్య పట్ల వ్యతిరేకత ఉన్న కాలంలో తొలి భారతీయ మహిళ ఉపాధ్యాయురాలుగా ఎదిగిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శనివారం పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాల, మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఉన్నత పాఠశాల, గాంధీనగర్ ఆక్స్ఫర్డ్, కాంతి హైస్కూల్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో  ప్రిన్సిపాల్ కరస్పాండెంట్లు మాట్లాడుతూ.. సావిత్రిబాయి గొప్ప సంఘసంస్కర్త హరిజన విద్యకు కృషి చేసిన జ్యోతిరావు పూలే యొక్క సతీమణి, భర్తనే ఆదర్శంగా తీసుకొని మహిళలకు పురుషులతో సమానంగా విద్యా అవకాశాలు కల్పించడానికి కృషి చేశారు అని ఈమె జయంతి జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా జరపబడుతుంది అని అన్నారు.

విద్యార్థిని విద్యార్థులకు ఈ కార్యక్రమంతో కాంతి పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఇంగ్లీష్ సబ్జెక్టులో 95 మార్కులు ఆపైన రావడానికి లింబాద్రి గౌడ్ (లాయర్) రాస ఆనంద్-స్ఫూర్తి సేవ సొసైటీ గారి ఆధ్వర్యంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ నిపుణుడు మెంటర్ వివేక్ చంద్ర గారి సహకారంతో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు కోచింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మెంటర్ వివేకచంద్ర  విద్యార్థులు పరీక్ష పై ఉన్న భయాన్ని వీడుతూ సులభతరంగా మంచి మార్కులు సాధించడానికి మెలకువలు వివరిస్తూ ఇంగ్లీష్ సబ్జెక్టులో కష్టతరమైనటువంటి అంశాల పైన అవగాహన  కల్పించి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సహకరించినటువంటి కాంతి హై స్కూల్ ప్రిన్సిపల్ గంగారెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెంటిల్ కిడ్స్ ప్రకాష్, ప్రిన్సిపాల్ లత.  వివిధ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -