నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి అత్యంత ఘనంగా జయంతి వేడుకను నిర్వహించరు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ మంథని నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డు రాజబాబు మాట్లాడుతూ..సావిత్రిబాయి పూలే స్త్రీల అభ్యున్నతి కొరకు ఎంతగానో కృషి చేసిన మహనీయురాలు, సంఘసంస్కర్త సత్యశోధకు మండలి సహవ్యస్థాపకురాలు అని అన్నారు. స్త్రీల విద్యా హక్కుల కోసం ఎంతో కృషిచేసిన వీర వనిత, సామాజిక రుగ్మత మీద అలుపెరుగని పోరాటం చేసి అణగారిన వర్గాలకు అండగా నిలబడిన మాతృమూర్తి సావిత్రిబాయి పూలే గారు అని ఆయన కొని ఆడారు.
ఈ కార్యక్రమంలో యు వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు వక్కల బాపు యాదవ్,ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు పీక కిరణ్,మాల మహానాడు జిల్లా నాయకులు బొబ్బిలి రాజయ్య నాయకపోడు సేవా సంఘం జిల్లా నాయకులు న్యాలం మొగిలి, మరియు ఎస్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.



