Monday, January 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలకు చదువు నేర్పిన తల్లి సావిత్రిబాయి పూలే 

మహిళలకు చదువు నేర్పిన తల్లి సావిత్రిబాయి పూలే 

- Advertisement -

యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింహులు 
నవతెలంగాణ – మిడ్జిల్ 

మహిళల కోసం పాఠశాలలను ఏర్పాటు చేసి మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే అని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ నర్సింలు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. సమాజాన్ని ప్రశ్నించే ధైర్యం సామాజిక దురాచారాలను ఎండగట్టి మహిళను చైతన్యం చేశారని కొనియాడారు. సావిత్రిబాయి పూలే ను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి ఎదగాలని కోరారు. పాఠశాలలో విద్యార్థులకు టై, బెల్టు లకు మిడ్జిల్ వార్డు మెంబర్ మంజుల రూ.5000 అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి,  సర్పంచ్ శంకర్ ఉప సర్పంచ, వార్డు మెంబర్లు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -