Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సావిత్రిబాయి పూలే వర్థంతి వేడుకలు

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్థంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.పద్మ ఆధ్వర్యంలో మంగళవారం భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మాత, చదువులతల్లి సావిత్రిబాయి పూలే 129వ వర్థంతి వేడుకలు నిర్వహించి, ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. పూలే గొప్ప సంఘసంస్కర్త, బాలికల విద్యకు పునాది వేసినటువంటి మహానుభావురాలు, బాల్య వివాహాలను నిర్మూలించడంలో పెద్దన్న పాత్ర పోషించిన గొప్పవ్యక్తిని ప్రధానోపాధ్యాయురాలు కొనియాడారు. ఆమే చరిత్రను విద్యార్థులకు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -