నవతెలంగాణ – ఆలేరు టౌన్
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన, సావిత్రిబాయి పూలే సేవలు ప్రశంసనీయమని, డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, విశ్రాంతి ఉద్యోగుల సంఘం (టాప్రా) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు బొమ్మకంటి బాలరాజు అన్నారు. ఆలేరు పట్టణంలో శనివారం సావిత్రిబాయి జయంతి పురస్కరించుకుని విగ్రహానికి విశ్రాంత ఉద్యోగులతో కలిసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలుగా ప్రసిద్ధి చెందిన సావిత్రిబాయి పూలే బడుగు బలహీన వర్గాల మహిళాలకు విద్యాభ్యాసం కొనసాగించుటలో విశేష కృషి చేసిన తొలి మహిళగా గుర్తించారు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి&సీనియర్ జర్నలిస్టు తిరునగరి శ్రీనివాస్ ,మొగుళ్ళ సుధాకర్ రెడ్డి,చిలుక రామ నర్సయ్య ,గోపరాజు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సావిత్రిబాయి పూలే సేవలు ప్రశంసనీయం
- Advertisement -
- Advertisement -



