నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండలంలో తెలంగాణ రాబిన్ హుడ్, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన పండుగ సాయన్న జయంతి వేడుకలను శుక్రవారం ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కీసర సంపత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి భూమ సంపత్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గూళ్ల రాజు, మండల బీసీ సెల్ అధ్యక్షులు రెడ్డి పవన్, నూనె శ్రీకాంత్, మరియు మండల పరిధిలోని వివిధ సంఘాల అధ్యక్షులు గరిగె ప్రభాకర్, రవితో పాటు భారీ సంఖ్యలో ముదిరాజ్ యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు గోపగోని బసవయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, బండారి తిరుపతి, నిజాముద్దీన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
శంకరపట్నంలో పండుగ సాయన్న జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES