Friday, February 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసాయుధ దళాల నిధికి ఎస్‌బీఐ రూ.53లక్షల విరాళం

సాయుధ దళాల నిధికి ఎస్‌బీఐ రూ.53లక్షల విరాళం

- Advertisement -

అభినందించిన రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) హైదరాబాద్‌ సర్కిల్‌ రూ.53,00,000 విరాళం అందించింది. ఈ మేరకు గురువారం ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాధాకృష్ణన్‌ చెక్కును గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మకు లోక్‌భవన్‌లో అందజేశారు. దేశం పట్ల ఎస్‌బీఐ సిబ్బందికి ఉన్న అంకిత భావాన్ని ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రశంసించారు. ఎస్‌బీఐని ఆదర్శంగా తీసుకుని ఇతర సంస్థలు, పౌరులు సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ఉదారంగా విరాళాలు అందించాలని కోరారు. మాజీ సైనికులు, యుద్ధ వితంతువుల సంక్షేమానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సైనిక్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ కెప్టెన్‌ శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -