Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ ఉద్యోగికి ఎస్బిఐ రూ.1 కోటి చేక్ అందజేత

విద్యుత్ ఉద్యోగికి ఎస్బిఐ రూ.1 కోటి చేక్ అందజేత

- Advertisement -

విద్యుత్ ఉద్యోగులకు సిఎస్పి ఖాతా తోనే ఉపయోగం
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ

విద్యుత్ శాఖలో పనిచేస్తూన్నా లైన్ ఇన్స్పెక్టర్ అసాడు శ్రీనివాస్ ప్రమాదవశాత్తు చనిపోయారు. వారి కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా చెక్కును వినాయక నగర్ ఎస్బిఐ వారి ఆధ్వర్యంలో విద్యుత్ జిల్లా ఎస్ఈ రాజేశ్వరరావు , డిఈ శ్రీనివాసరావు , ఎస్బిఐ రీజనల్ మేనేజర్ కోలేటి మహేశ్వరరావు చేతుల మీదుగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ముఖ్యంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కార్పొరేట్ సాలరీ ప్యాకేజీ (సి ఎస్ పి) కింద ఎస్బిఐ బ్యాంకు లో సిఎస్పి అకౌంట్ ఉన్నవారందరికీ ప్రమాదవశాత్తులో ఉద్యోగి చనిపోతే వారి కుటుంబానికి 1 కోటి రూపాయల నగదును ఇవ్వడం జరుగుతుందని, ప్రమాదవశాత్తు ఇతర అవయవాలు పనిచేయకపోయినా వారికి 80 లక్షల వరకు అందిస్తామని, నార్మల్ డేత్ అయినా వారికి 10 లక్షల వరకు ఆర్థిక సదుపాయాలు కల్పిస్తారని తెలిపారు. 

 గతంలో ఎన్నో రోజులుగా విద్యుత్ శాఖలో పని చేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయాలని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న యూనియన్లు ఉద్యోగులు ప్రభుత్వాలకు విన్నవించిన మార్పు జరగలేదు అని, టీజీ ఎన్పిడిసిఎల్ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే ఈ సదుపాయాన్ని బ్యాంకుల తో ఎంఒయు ఏర్పరచుకొని విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపారు అని, ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగి, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగులకు ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఉన్న సిఎస్పి అకౌంట్ తోనే మీ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమములో ఎస్బిఐ బ్యాంక్ అధికారులు బదవత్ రవి , సోమేశ్వర్ రావు , అఖిలాండేశ్వరి , విద్యుత్ ఉద్యోగ సంఘ నాయకులు రఘునందన్, గంగాధర్, సురేష్, గంగారాం నాయక్, చాంద్ పాషా, చంద్రశేఖర్, రాజేందర్, విద్యుత్ ఉద్యోగులందరూ పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -