కొనుగోలుదారులకు పలు రాయితీలు
నవతెలంగాణ – హైదరాబాద్
దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోమారు మెగా ప్రాపర్టీ షోను ఏర్పాటు చేస్తోంది. నివాస కొనుగోలుదారులకు ప్రాపర్టీలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో హైటెక్స్‌లోని నాలుగో నెంబర్ హాల్‌లో డిసెంబర్ 19 నుంచి 21 వరకు దీన్ని నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి గురువారం ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ హెడ్ ఆఫీసులో ప్రచార క్యాంపెయిన్‌ను ఆ బ్యాంక్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్ రాధాక్రిష్ణన్, ఇతర అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గృహ రుణాల్లో ఎస్బీఐ మార్కెట్ లీడర్‌గా ఉందన్నారు, ఈ ఎక్స్‌పోలో 60కి పైగా డెవలపర్లు తమ వివిధ ప్రాజెక్టులను ప్రదర్శనకు పెడుతున్నారని చెప్పారు. ఆసక్తి కలిగిన వారు ఎక్స్‌పోలో నివాసాలను కొనుగోలు చేయడం ద్వారా పలు డిస్కౌంట్లు పొందవచ్చన్నారు.
ప్రాసెసింగ్ ఫీజు రద్దు, లీగల్, వాల్యూయేషన్‌కు కూడా ఎలాంటి చార్జి వసూలు చేయడం లేదన్నారు. గృహ రుణాలపై వడ్డీ రేట్ల శ్రేణీ 7.7 శాతం నుంచి 8.5 శాతంగా ఉందన్నారు. రుణగ్రహీత పరపతి, ఆస్తి ఆధారంగా వడ్డీ రేట్లను అమలు చేయనున్నామన్నారు. తమ సంస్థ తెలంగాణలో ప్రతీ నెల రూ.2,000 కోట్ల పైగా గృహ రుణాలను జారీ చేస్తోందన్నారు. ఇందులో 60-70 శాతం వరకు హైదరాబాద్ నుంచే వస్తోన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో ఎస్బీఐ కూడా భాగస్వామ్యం అవుతోందన్నారు. మూడు రోజుల పాటు సాగనున్న ఈ ఎక్స్‌పోను కొనుగోలుదారులు ఉపయోగించుకోవాలని రాధాకృష్ణన్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్లు రవి కుమార్ వర్మ, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
19 నుంచి ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో
- Advertisement -
- Advertisement -



