Sunday, March 22, 2026
E-PAPER
Homeబీజినెస్పబ్లిక్‌ ఇష్యూకు ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌..!

పబ్లిక్‌ ఇష్యూకు ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌..!

- Advertisement -

సెబీకి దరఖాస్తు
న్యూఢిల్లీ : దేశీ అతిపెద్ద ఫండ్‌ హౌస్‌ ఎస్‌బిఐ మ్యూచువల్‌ ఫండ్‌ పబ్లిక్‌ ఇష్యూ కోసం సెబీకి ప్రాథమిక పత్రాలను సెబికీ సమర్పించింది. రూ.12.5 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తున్న ఈ సంస్థ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఒఎఫ్‌ఎస్‌) రూపంలో 20.37 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఇందులో ప్రధాన ప్రమోటర్లయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అముండి ఇండియా హోల్డింగ్‌ తమ వాటాలను తగ్గించుకోనున్నాయి. ఈ మెగా ఐపిఒ నిర్వహణ కోసం కోటక్‌ మహీంద్రా, ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌ వంటి ప్రముఖ మర్చంట్‌ బ్యాంకర్ల కన్సార్టియంను కంపెనీ నియమించింది. ”భారతదేశంలో మొట్ట మొదటి నాన్‌ యుటిఐ మ్యూచువల్‌ ఫండ్‌గా మా ప్రస్థానం చారిత్రాత్మకమైనది. ఈ ఐపిఒ ద్వారా మరింత పారదర్శకతను పెంచుతూ, దేశీయ మూలధన మార్కెట్లో మా నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటా ము” అని ఆ సంస్థ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -