Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం..

ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం  చేసిందని వెల్దండ మండల మాల మహానాడు నాయకులు  నిరంజన్ , జంగిలి ఆనంద్ అన్నారు. జీవో 99 రద్దు చేయాలి రోస్టర్ విధానంలో 22 నుంచి 16కు తగ్గించాలని ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో మాల మహానాడు నాయకులను వెల్దండ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలకు మాలలు కు జరిగిన అన్యాయాన్ని  చెప్పడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడం  సరైన నిర్ణయం కాదని వారు తెలిపాటు. రాబోయే కాలంలో ఉద్యమాన్ని ప్రజలుగా ఉదృతం  చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెల్దండ మండల మాల మహానాడు నాయకులు  సిరసనగండ్ల శ్రీనివాస్, జంగిలి రవికుమార్, గోరటి రాజు, జంగిలి కొండల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -