Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సీ వర్గీకరణ విజయం మాదిగ అమరవీరులకు అంకితం

ఎస్సీ వర్గీకరణ విజయం మాదిగ అమరవీరులకు అంకితం

- Advertisement -

జాతి కోసం అమరుల త్యాగం మరువలేనిది 
టైగర్ జంగయ్య మాదిగ 
నవతెలంగాణ – మిడ్జిల్ 

ఎస్సీ వర్గీకరణ ద్వారానే 59 కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా రాజ్యాంగ ఫలాలు దక్కుతాయని మూడు దశాబ్దాలుగా అందుకుష్ట మాదిగ నాయకత్వంలో ఉద్యమాలు చేసి ఎస్సీ వర్గీకరణ విజయం మాదిగ అమరవీరులకు అంకితమవుతుందని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్చార్జి టైగర్ జంగయ్య మాదిగ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో అంబేద్కర్ భవనంలో మాదిగ అమరవీరుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగళ్ళ సురేష్ మాదిగ అధ్యక్షతన ఏర్పాటు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం మూడు దశాబ్దాలు పాటు కొనసాగిన సామాజిక ఉద్యమంలో జాతి కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన మాదిగ అమరవీరుల  త్యాగాలు మరువలేనివని  చెప్పారు. అన్ని  త్యాగాలలో  గొప్ప త్యాగం ప్రాణ త్యాగం అని జాతి కోసం ప్రాణ త్యాగం చేసి అమరుల లక్ష్యం వృధా కాలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాజీ అధ్యక్షులు గణేష్ మాదిగ ,అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బరిగెల దేవయ్య ,గుడ్ల బాలయ్య , బరిగెల బుచ్చయ్య,సుకుమార్,మహేష్, వార్డు సభ్యులు పర్వతాలు,గోపాల్ ,తిరుపతి, లక్ష్మణ్ పవర్,అంజనేయులు, పోషయ్య,రాము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -